జాస్తి కృష్ణకిశోర్‌పై సీఐడీ కేసు నమోదు

Update: 2019-12-16 04:09 GMT

ఆంధ్రప్రదేశ్ ఆర్ధికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) గత ప్రభుత్వంలో ఏర్పాటైన సంస్థ. ఇందులో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంతోపాటు పలు అంతర్జాతీయ సమావేశాలకు చెందిన ఆహ్వానాలను కొనుగోలు చేసి..ఆ తర్వాత తమకు ఆహ్వానాలు వచ్చాయని..దేశంలో ఎవరికీ ఇలాంటి పిలుపులు రాలేదంటూ ప్రచారం చేసుకున్నారు. దీని కోసం కోట్లాది రూపాయల వ్యయం చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే ఈడీబీ సీఈవో పనిచేసిన జాస్తి క్రిష్ణకిషోర్ చిక్కుల్లోపడ్డారు. ఏకంగా సస్పెన్షన్ కు గురవటంతోపాటు..ఆయనపై సీఐడీ కేసు కూడా నమోదు అయింది.

ప్రభుత్వోద్యోగిగా ఉంటూ నేరపూరిత నమ్మకద్రోహానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన. కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ పలు సెక్షన్ల కింద కేసు సీఐడి కేసు నమోదు చేసింది. పరిశ్రమలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ నుంచి అందిన నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు అయింది.

 

Similar News