టీడీపీకి సాదినేని యామిని రాజీనామా

Update: 2019-11-08 08:03 GMT

తెలుగుదేశం పార్టీలో చేరింది అప్పుడే అయినా ఆ పార్టీ నేతలు మాత్రం ఆమెకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చారు. సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టి ఏ అంశంపై అయినా ఆమెతోనే మాట్లాడించేవారు. ఈ తీరు చూసి కొంత మంది సీనియర్ నేతలు ఇదెక్కడి వ్యవహారం అంటూ అవాక్కు అయ్యారు కూడా.. అంతే కాదు ఆమె కొన్నిసార్లు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదం అయి టీడీపీని ఇరకాటంలోకి నెట్టాయి. అధికారంలో ఉన్నంత కాలం హవా చెలాయించిన సాదినేని యామిని టీడీపీకి గుడ్ బై చెప్పారు.

ఈ మేరకు టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఆమె గురువారం తన రాజీనామా లేఖను పోస్టు చేశారు. టీడీపీలో తనకు ఇబ్బందులు, అంతర్గత విభేదాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాభవం తరువాత.. యామిని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికలకు ముందు సోషల్‌ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉన్న యామిని... తర్వాతి కాలంలో సైలెంట్‌ అయిపోయారు. గత కొంత కాలంగా ఆమె పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది.

Similar News