చంద్రబాబు కాన్వాయ్ పైకి రాళ్ళు..చెప్పులు

Update: 2019-11-28 05:57 GMT

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. అమరావతి పర్యటన సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలతో కలసి వెళుతున్న సమయంలో కొంత మంది ఆయన కాన్వాయ్ పైకి రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో కాన్వాయ్ లోని ఓ కారు అద్దం పగలగా..చంద్రబాబు ఉన్న బస్సు కు కూడా కొంత నష్టం వాటిల్లింది.

భారీ ఎత్తున గుమిగూడిన ప్రజలు చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా నల్లజెండాలు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు అమరావతి పర్యటన ప్రకటించిన దగ్గర నుంచి ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో వైసీపీ, టీడీపీ వర్గాలు బాహాబాహీకి దిగాయి.

Similar News