సెలవుపై ఎల్వీ సుబ్రమణ్యం

Update: 2019-11-06 10:18 GMT

అవమానకరరీతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించబడ్డ ఎల్వీ సుబ్రమణ్యం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన నూతన విధుల్లో చేరకుండా నెల రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ఎల్వీని తప్పించిన తీరుపై ఇఫ్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఎల్వీ సుబ్రమణ్యం అమరావతిలో ఇన్ ఛార్జి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు.

అనంతరం సెలవుపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రాధమిక సమాచారం ఆయన డిసెంబరు 6 తేదీ వరకూ సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. సీఎస్ పదవి నుంచి తప్పించిన ప్రభుత్వం ఆయనకు మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా కొత్తబాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ బాధ్యతలు తీసుకోకుండా సెలవుపై వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

 

Similar News