ఏపీలో తొలిసారి గవర్నర్, ముఖ్యమంత్రుల కుటుంబాలు సమావేశం అయ్యాయి. గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులకు విందు ఇచ్చారు. ఈ తరహా భేటీ జరగటం ఇదే మొదటిసారి. సోమవారం మధ్యాహ్నాం సమయంలో జగన్, ఆయన భార్య భారతితో కలసి గవర్నర్ దంపతులతో సమావేశం అయ్యారు. వీరిద్దరూ గంటకు పైగా పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. త‍్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గవర్నర్‌కు నివేదించారు.