చంద్రబాబుతో లాలూచీ..జగన్ తోనే పేచీ

Update: 2019-10-25 12:31 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మండిపడింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ నే విమర్శించారు..ఇప్పుడు జగన్ నే విమర్శిస్తున్నారని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయన్ను ఏనాడైనా ప్రశ్నించారు. అప్పుడు కూడా జగన్ నే తిట్టారు కదా?. అని వ్యాఖ్యానించారు. పవన్ తీరు చంద్రబాబుతో లాలూచీ...జగన్ తో పేచీ అన్న చందంగా ఉందని విమర్శించారు. ఆయన శుక్రవారం నావైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కి కేసుల్లేవ్ కదా.. బీజేపీ, టీడీపీ తో ఏం సాధించారు.

తామిచ్చిన జీవో 486 కోసం మోదీకి చెప్తానన్న పవన్.. అప్పుడెందుకు రాష్ట్ర హక్కుల కోసం ప్రధాని దగ్గరకెళ్లలేదు. ఎన్నికల ముందు జనసేన పార్టీ సీట్లు కూడా చంద్రబాబే ఇచ్చారు. కెఏ పాల్ అమాయకుడు కాబట్టి ఐలపురం హోటల్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు. పవన్ తెలివైన వారు కాబట్టి టీడీపీతో అమెరికాలో సెటిల్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట ప్రచారం చేయలేదని చంద్రబాబే చెప్పారు. ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌ను మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. పవన్ దాని కోసం ఎందుకు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. సీఎం జగన్‌ను వ్యతిరేకించడమే పవనిజంగా ఉందిఅని నాని ధ్వజమెత్తారు.

Similar News