ఏపీకి చెందిన మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి బిజెపిలో చేరారు. గత కొంత కాలంగా ఆయన బిజెపి నేతలను కలుస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఆయన ఎప్పుడో పార్టీ మారాల్సి ఉన్నా...జాప్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు సోమవారం నాడు ఢిల్లీలో బిజెపి కండువా కప్పుకున్నారు.
జమ్మలమడుగులో 2014 లో గెలిచిన తర్వాత కాంతకాలానికి ఆయన వైసిపి నుంచి టిడిపిలోకి జంప్ చేసి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. గత ఎన్నికలలో ఆయన కడప లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. కొద్ది రోజుల క్రితం ఆయన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో సమావేశం అయి పరిస్థితిని వివరించినట్లు వార్తలు వచ్చాయి