ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీ డీజీపీపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కంటే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెయ్యి రెట్లు మేలని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీ ఆఫీస్ ను వైసీపీ ఆఫీస్ లా మార్చారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్తే డీజీపీ ఎందుకు కలవలేదు.డీ జీపీ ఎందుకు అంత గా సహనం కోల్పోతున్నారు. మీడియా పై ఆంక్షల ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలి.జగన్ రాజకీయానికి ఈ ఆంక్షలు మరణ శాసనం అవుతాయి. నియంత లా వ్యవహరించిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు.డీజీపీ నాకు నోటీసులు పంపుతాము అన్నారు...పంపండి చూద్దాం. జగన్ శాశ్వతం కాదు....రాష్ట్రం శాశ్వతం.రాజశేఖర్ రెడ్డి కి పట్టు విడుపులు ఉండేవి జగన్ కంటే రాజశేఖర్ రెడ్డి 1000 రేట్లు బెటర్ . వైఎస్ఆర్ కు హుందా తనం ఉండేది. ఎవరైనా తప్పని చెపితే వినేవారు...వెనక్కి తగ్గేవారు.ఇప్పుటికైనా జగన్ మీడియా పై ఆంక్షల విషయం లో వెనక్కి తగ్గాలి.ఒకే వ్యక్తి పై వరుస కేసులతో జైలులోనే ఉంచే పరిస్థితి తెచ్చారు.
దేవుని నగలు మా ఇంట్లో ఉన్నాయని రాసిన వారిపై చర్యలు తీసుకుంటారా?. వైఎస్ పక్కన పెట్టిన జీవో పరిధి పెంచి జగన్ ఇప్పుడు తీసుకు వచ్చారు.జగన్ ఒక్క సారి చరిత్ర ను చవదువుకుని ఉంటే బాగుండేది.వివేకా హత్య మీద ఎవరూ మాట్లాడ కూడదని డీజీపీ ఎలా అంటారు? వివేకా హత్య కేసులో, ఎస్పీలను, సిట్ లను ఎందుకు మార్చారు. కోటంరెడ్డి అంత దారుణం గా మాట్లాడితే రాష్ట్రంలో దిక్కు లేదు. జర్నలిస్ట్ ల యూనియన్లనే బెదిరిస్తున్నారు.ఆమంచి కుటుంబ సభ్యులు పోలీసులను అన్న మాటలు డీజీపీ కి వినిపించలేదా? ఇసుక లభ్యం అయ్యే ఊళ్ళోనే ఇసుక అందుబాటు లో లేకుండా చేశారు.సచివాలయ ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయి. మీడియా పై రాష్ట్రం లో వరుసగా దాడులు జరుగుతున్నాయి’ అని ఆరోపించారు. జగన్ సర్కారు అక్రమాలపై ఎవరూ నోరెత్తకూడదని అన్న చందంగా సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.