ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు ఢిల్లీ వెళ్ళనున్నారు. వాస్తవానికి ఆయన గత కొన్ని రోజులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంతో పాటు ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో అమిత్ షాతో భేటీ సాద్యం కాలేదు. ఓ సారి ఖరారు అయిన అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా రద్దు అయింది.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగియటంతో జగన్ ఢిల్లీ వెళ్ళి సోమవారం నాడు హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువరు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ పర్యటనలో భాగంగగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రమంత్రులతో ఆయన చర్చించనున్నారు. జగన్ సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు.