ఏపీ అసెంబ్లీలో మూడు కమిటీలకు సంబంధించి నియామకాలు పూర్తయ్యాయి. ప్రతిపక్షానికి దక్కే అత్యంత కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌తో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు ఇందులో చోటు కల్పించారు. ఎస్టిమేట్స్ కమిటీకి ఛైర్మన్‌గా రాజన్న దొర, ముగ్గురు ఎమ్మెల్సీలను నియమించారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి ఛైర్మన్‌గా చిర్ల జగ్గిరెడ్డితో పాటు సభ్యులుగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను నియమించారు.
పబ్లిక్ అకౌంట్ కమీటి సభ్యులు:
1. పయ్యావుల కేశవ్(ఛైర్మన్), 2. సంజీవయ్య కిలిబెటి, 3. కోలగట్ల వీరభద్ర స్వామి, 4. మేరుగు నాగర్జున, 5. భూమన కరుణాకర్‌రెడ్డి 6. కరణం ధర్మశ్రీ 7. జోగి రమేష్, 8. కెవి. ఉషశ్రీ చరణ్, 9.కాటసాని రాంభూపాల్ రెడ్డి, 10. బీద రవీచంద్ర, 11.డి.జగదీశ్వరరావు, 12. బాలసుబ్రమణ్యం.
ఎస్టిమేట్ కమిటీ సభ్యులు:
1. రాజన్న దొర పీడిక, 2. అమర్‌నాథ్ గుడివాడ, 3. రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి, 4. కిరణ్ కుమార్ గొర్లె, 5. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, 6. అనిల్ కుమార్ కైలే, 7. మదిశెట్టి వేణుగోపాల్, 8. మండలి గిరిధర రావు, 9. ఆదిరెడ్డి భవాని, 10. దువ్వారపు రామారావు, 11. పరుచూరి అశోక్‌బాబు, 12. వెన్నపూస గోపాల్‌రెడ్డి
పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ:
1. చిర్ల జగ్గిరెడ్డి 2. గ్రంధి శ్రీనివాస్, 3. కిలారి వెంకటరోశయ్య, 4. జొన్నలగడ్డ పద్మావతి, 5. అన్నా రాంబాబు, 6. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, 7. రవీంద్రనాథ్‌రెడ్డి, 8. చంద్రశేఖర్‌రెడ్డి, 9. వాసుపల్లి గణేష్ కుమార్10. వెంకట సత్యనారాయణ రాజు, 11. గుంజపాటి దీపక్‌రెడ్డి, 12. సోము వీర్రాజు