జనసేన ‘ట్విట్టర్ ఖాతా’ల బ్లాక్ పై పవన్ ఫైర్

Update: 2019-09-18 10:58 GMT

సోషల్ మీడియాలో జనసేన విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన 300 మంది కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 మంది జనసేన కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలు ఎందుకు బ్లాక్ చేశారో నాకు అర్ధం కావటం లేదు. అవసరాల్లో ఉన్న సామాన్యుల తరపున నిలబడి పోరాటం చేయటం తప్పా?.

అలా పోరాడుతున్నందుకు రద్దు చేశారా?. దీన్ని మేం ఎలా స్వీకరించాలి అంటూ ప్రశ్నలు సంధించారు. జనసేన పార్టీ కార్యకర్తల ట్విట్టర్ ఖాతాల రద్దు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పవన్ కూడా రంగంలోకి దిగి #Bringback Jsp social Media ట్యాగ్ ను జత చేశారు.

 

Similar News