టీడీపీకి మరో షాక్

Update: 2019-09-04 05:17 GMT

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఆయన సోదరుడే ఝలక్ ఇచ్చారరు. అది కూడా అయ్యన్నపాత్రుడి పుట్టిన రోజు కావటం విశేషం. అయ్యన్నపాత్రుడి రాజకీయ వ్యవహారాల్లో ఇంత కాలం ఆయన కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇప్పుడు సోదరుడు దూరం కావటంతో అయ్యన్నపాత్రుడికి రాజకీయంగా ఇబ్బందికర పరిణామంగా మారనుంది.

అయ్యన్న సోదరుడు అయిన సన్యాసిపాత్రుడు బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం విదితమే. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు వైజాగ్ పర్యటన పెట్టుకున్నారు. ఈ తరుణంలో సన్యాసినాయుడు రాజీనామా నిర్ణయం వెలువడటం విశేషం.

 

Similar News