కెసీఆర్, జగన్ భేటీ

Update: 2019-09-23 13:07 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కెసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు సోమవారం నాడు హైదరాబాద్ లో మరోసారి సమావేశం అయ్యారు. సీఎం కెసీఆర్ అధికారిక కార్యాలయం ప్రగతి భవన్ లో ఈ భేటీ జరిగింది. విభజన చట్టంలోని పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరుపనున్నట్లు సమాచారం. గోదావరిపై రెండు రాష్ట్రాలు తలపెట్టిన ఉమ్మడి ప్రాజెక్టు.. 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగు విద్యుత్తు బిల్లులు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

దీంతోపాటు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆహ్వానించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(టీటీడీ) తరపున ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు వైఎస్ జగన్‌ అందజేశారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు సీఎం జగన్‌ వెంట ఉన్నారు.

 

Similar News