జగన్ సర్కారుపై కన్నా ఫైర్

Update: 2019-09-16 04:14 GMT

ప్రతిపక్ష టీడీపీ ప్రస్తుతానికి వెనక్కి తగ్గినా బిజెపి మాత్రం పల్నాడు రాజకీయాన్నిముందుకు తీసుకెళుతోంది. సోమవారం నాడు గురజాలలో సభ పెట్టి తీరుతామని బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్నందున సభలు, సమావేశాలకు అనుమతి లేదని చెబుతున్నారు.

సభకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా..కన్నా వాటిని తీసుకోలేదు. దీంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించి పోలీసులు ముందుకెళ్ళారు. రెండు నియోజకవర్గాల్లో శాంతి భధ్రతలను అదుపు చేయలేరా?అని కన్నా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురజాలలో సభను నిర్వహించి తీరుతామన్నారు.

 

 

Similar News