సింధు దేశం గర్వించేలా చేసింది

Update: 2019-08-27 08:44 GMT

పీ వీ సింధు మంగళవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత్ తరపున తొలి స్వర్ణం సాధించిన ఈ తెలుగు తేజాన్ని మోడీ అభినందించారు. బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన ఛాంపియన్ సింధు అని మోడీ కొనియాడారు. సింధును కలసి ఫోటోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

సింధుతోపాటు ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్, కేంద్ర క్రీడల శాఖ మంత్రి కూడా ఉన్నారు. భవిష్యత్ లో సింధు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని మోడీ ఆకాంక్షించారు. తన నివాసానికి వచ్చిన సింధు మెడలో బంగారు పతకం వేసి సత్కరించారు మోడీ.

Similar News