సీబీఐ కోర్టుకు నిమ్మగడ్డ అరెస్టు సమాచారం

Update: 2019-08-02 14:57 GMT

ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ విషయాన్ని ఆయన లాయర్లు సీబీఐ కోర్టుకు నివేదించారు. అయితే అసలు సెర్బియాలో నిమ్మగడ్డను ఎందుకు అరెస్టు చేశారు...ఈ కేసు వివరాలు ఏమిటో కనుక్కుని నివేదిక ఇవ్వాల్సిందిగా కోర్టు సీబీఐని కోరింది. తనను సెర్బియాలో బెల్ గ్రేడ్ పోలీసులు నిర్బంధించిన నేపధ్యంలో కోర్టు వాయిదాకు హజరుకాలేకపోతున్నట్లు నిమ్మగడ్డ ప్రసాద్ సిబిఐకోర్టుకు తన న్యాయవాది ద్వారా తెలియచేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన వాన్ పిక్ కేసులో శుక్రవారం నిమ్మగడ్డ సిబిఐకోర్టుకు హజరుకావాల్సి ఉంది.

నాలుగురోజుల క్రితం నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా లో ఇంటర్ పోల్ అధికారులు నిర్బంధించి బెల్ గ్రేడ్ పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ ప్రసాద్ సిబిఐ కోర్టు అనుమతితోనే విదేశీ పర్యటనకు సెర్బియా వెళ్లారు. వాన్ పిక్ వ్యవహారంలో రస్ ఆల్ ఖైమా పెట్టుబడులకు సంబంధించిన వివాదంలో చాలాకాలంగా నిమ్మగడ్డ ప్రసాద్ కోసం వేచిచూస్తున్న రస్ అల్ ఖైమా అధికారులు ఇంటర్ పోల్ ను అప్రమత్తం చేసి నిమ్మగడ్డను అదుపులోనికి తీసుకున్నారు. దాదాపు 750 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన వ్యవహారం కావడంతో నిమ్మగడ్డ చిక్కుల్లో పడ్డారు.

 

 

Similar News