నన్నపనేని రాజకుమారి

Update: 2019-08-07 14:54 GMT

నన్నపనేని రాజకుమారి ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ పదవికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కి అందచేశారు. తర్వాత నన్నపనేని మీడియాతో మాట్లాడుతూ...‘ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశాను. మూడేళ్ల వార్షిక నివేదికను గవర్నర్‌కు అందచేశా. నా నివేదికను చూసి గవర్నర్‌ అభినందించారు. రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదిక అడ్డంకిగా మారింది.

నా హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచా. వసతి గృహాల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలి.’ అని అన్నారు. ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వైసీపీకి చెందిన అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మకు ఇస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మరి నన్నపనేని రాజీనామాతో ఆమెకు లైన్ క్లియర్ అయినట్లేనా? లేదా అన్నది కొద్ది కాలం పోతే కానీ తెలియదు.

 

Similar News