ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. అయితే ఇది కూడా పూర్తి వ్యక్తిగత పర్యటనే. ఈ నెలలోనే జగన్ వ్యక్తిగత పర్యటన కింద జెరూసలెం వెళ్ళి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి ఆగస్టు 15 రాత్రి హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన తిరిగి ఆగస్టు 24న అమరావతి చేరుకోనున్నారు.
సీఎం జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్పించేందుకు అమెరికా వెళుతున్నారని చెబుతున్నారు. అదే సమయంలో 17న డల్లాస్‌లోని కే బెయిలీ హచిసెన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.