రాజధాని వ్యవహారంపై సాగుతున్న రగడపై తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు స్పందించారు. అమరావతిపై కుట్రలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇక్కడ రాజధాని రాకుండా చేయాలనే ఈ ప్రాంతాన్ని వరదలు ముంచాయని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాజధానిపై బొత్స సత్యనారాయణ మాటలు దారుణంగా ఉన్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం, అమరావతి పనులు ఆగిపోయాయని విమర్శించారు.
ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ కుయుక్తులను అడ్డుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామని చంద్రబాబు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రైతులే 33 వేల ఎకరాలు ఇఛ్చారని..అన్నీ పోను 8 వేల ఎకరాలు మిగులుతుందని..ఈ భూములను అమ్మి కూడా ప్రభుత్వంపై భారం లేకుండా రాజధాని నిర్మించుకోవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు.