పోలవరం ప్రాజెక్టు అంశంపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పందించారు. రివర్స్ టెండరింగ్ వద్దని ఎవరు చెప్పినా వినకుండా సీఎం జగన్ మూర్ఖంగా ముందుకెళ్లారని ఆరోపించారు. మరి ప్రాజెక్టు విషయంలో జగన్ ఇప్పుడేమీ చెబుతారని ప్రశ్నించారు. పోలవరం జలవిద్యుత్ కేంద్రం పనుల రద్దు చెల్లదని హైకోర్టు ఆదేశాలు జారీ చేయటంతో ఈ పనులకు కూడా బ్రేక్ పడినట్లు అయింది.
కేంద్ర మంత్రి గడ్కరీ కూడా రివర్స్ టెండరింగ్ వద్దని చెప్పారని..ఒక్కసారి ప్రాజెక్టు న్యాయవివాదాల్లో చిక్కుకుంటే జాప్యం అవుతుందని అన్నారు. జాప్యం వల్ల ప్రాజెక్టుపై మరింత భారం పడుతుందని తెలిపారు. తాజా పరిణామాలపై అటు కేంద్రం, ఇటు పీపీఏ ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.