ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్ పర్సన్ గా ఎమ్మెల్యే రోజా నియమితులయ్యారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె రెండేళ్ల పాటు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా కొనసాగనున్నారు.
జగన్ కేబినెట్ లో ఆమెకు ఖచ్చితంగా మంత్రి ఛాన్స్ లభిస్తుందని అందరూ భావించారు. కానీ వివిధ రకాల సమీకరణలతో ఆమెకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో ఆమెను జగన్ ఏపీఐఐసీ ఛైర్మన్ గా నియమించారు.