కాపు కార్పొరేషన్ ఛైర్మన్ నియామకం

Update: 2019-07-29 08:02 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్ళే ముందు పెండింగ్ పదవుల భర్తీని వరస పెట్టి పూర్తి చేస్తున్నట్లు కన్పిస్తోంది. అందులో భాగంగానే ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియమితులయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తనను కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించటంపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జక్కంపూడి కుటుంబం... వైఎస్‌ జగన్‌ వెన్నంటే ఉన్నారు.

 

Similar News