చంద్రబాబుకు అసలు బుద్ధి..జ్ణానం ఉందా?

Update: 2019-07-18 08:19 GMT

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాట్లాడితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారని..అంత అనుభవం ఉన్న నేత ఆదర్శంగా ఉండాలి కానీ..అక్రమ కట్టడంలో ఉంటా? నేను ఖాళీ చేయను. దాన్ని కూల్చితే నాకు ఇళ్ళు కూడా లేకుండా చేశారు అని ప్రచారం చేసుకోవాలనే ఆలోచన తప్ప..మరొకటి ఉందా? అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు జగన్. ముఖ్యమంత్రయినా సామాన్యుడైనా ఒకటే నిబంధన ఉండాలి. నిబంధనలు అతిక్రమించేందుకేనా అనుభవం అని ప్రశ్నించారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని రివర్‌ కన్జర్వేటివ్‌ ఇంజనీర్‌ రాసిన లేఖను ఈ సందర్భంగా సీఎం జగన్‌ స్పీకర్‌ దృష్టికి తెచ్చారు.

స్వయంగా చంద్రబాబు రివర్‌ కన్జర్వేటివ్‌ నిబంధనలు తుంగలో తొక్కారు. సామాన్యుడు అక్రమ నిర్మాణం చేపడితే వెంటనే కూల్చేస్తారు కదా? అని ప్రశ్నించారు. అందుకే నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం జరుగుతుందని వివరించారు. కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాల వల్ల తీవ్రనష్టం వాటిల్లుతోంది. వర్షాలు పడితే ముంబై, చెన్నై నగరాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటున్నాయో చూస్తున్నాం. అప్పటి సీఎం చంద్రబాబు రూల్స్‌ పాటించకపోవడంతో అక్రమకట్టడాలు వెలిశాయి.

 

Similar News