నియోజకవర్గానికి కోటి..చంద్రబాబుకూ ఇస్తాం

Update: 2019-07-11 09:36 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు అసెంబ్లీలో పలు కీలక ప్రకటనలు చేశారు. నియోజకవర్గాల్లో తాగునీటి సమస్యతోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి నియోజకవర్గానికి కోటి రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ఈ నిధులు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి కూడా కేటాయిస్తామన్నారు. అధికారపక్షం..ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరికీ ఈ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అభివృద్ధి నుంచి ఈ నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ అంశంపై జగన్ ప్రకటన చేసిన సమయంలో కొద్దిసేపు ఆసక్తికరమైన సంవాదం చోటుచేసుకుంది. తాము ప్రతిపక్షంలో ఉండగా..చంద్రబాబును కలసి నిధులు కేటాయించాల్సిందిగా కోరినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చేదిలేని చెప్పారని ఆరోపించారు.

కానీ ఇఫ్పుడు తమ సీఎం జగన్ స్వయంగా సభలో ప్రతిపక్ష నేత తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ కేటాయిస్తామన్నారని చెప్పారని..దీనికి కనీసం చంద్రబాబు ధన్యవాదాలు చెప్పాలని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఓ ఎస్టీ ఎమ్మెల్యేను రైతు దినోత్సవానికి రాకుండా అడ్డుకున్నారని..దీనికి క్షమాపణ చెపితే తాము అభినందనలు తెలుపుతామని వ్యాఖ్యానించారు. సాక్ష్యాత్తూ ఎమ్మెల్యేలను బెదిరించాలని చూస్తారా? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో అధికార పార్టీ సభ్యులు టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో కొద్దిసేపు ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

 

Similar News