ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన ఆ యువకుడు మృత్యువాతకు గురయ్యాడు. ఊహించని ఈ ఘటనతో కుర్రాడి ఫ్యామిలీ షాక్ కు గురైంది. విశాఖ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలోని ఓ సరస్సులో ఈత కోసం దిగి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లిన అవినాష్ రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ సరస్సులో బోటు షికారుకు వెళ్లాడు.
సరస్సు లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో ప్రమాదవశాత్తూ అవినాష్ గల్లంతయ్యాడని అతని స్నేహితులు వెల్లడించారు. అవినాష్ కుంటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. ఎంఎస్ పూర్తి చేసిన అతను ఇటీవలే ఉద్యోగంలో చేరినట్టు చెబుతున్నారు.