తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా మాజీ ఎంపీ వై వీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఛైర్మన్ నియామకపు నోటిఫికేషన్ మాత్రమే వెలువడింది. త్వరలోనే బోర్డు సభ్యులను కూడా నియమించనున్నట్లు అందులో పేర్కొన్నారు. వై వీ సుబ్బారెడ్డి శనివారం నాడే టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.