రాజ్యసభ ఛైర్మన్ కు టీడీపీ ఎంపీల లేఖ

Update: 2019-06-20 11:11 GMT

ప్రచారం జరిగిందే నిజమైంది. టీడీపీ ఎంపీలు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి షాక్ ఇచ్చారు. తమను రాజ్యసభలో ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలంటూ టీడీపీ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడికి లేఖ అందజేశారు. ఈ లేఖ అందజేసిన వారిలో సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ లు ఉన్నారు. ఇది బిజెపి నేతల ప్రోద్భలంతో జరిగింది కావటంతో రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం ఎలా ఉంటుందా? అన్న ఆసక్తి ప్రస్తుతం అందరిలో నెలకొంది.

దీంతో టీడీపీపీలో చీలిక వచ్చినట్లు అయింది. గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలు కావటంతో ఇప్పుడు ఆ ప్రభావం పార్టీపై పడుతోంది. అదే సమయంలో టీడీపీని తీవ్రంగా దెబ్బకొట్టేందుకు బిజెపి సన్నాహాలు చేస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కూడా ఈ పరిణామాలపై స్పందించారు. బిజెపి చర్యలను ఆయన ఖండించారు. ఇలాంటి సంక్షోభాలు టీడీపీకి కొత్తేమీ కాదన్నారు.

Similar News