జగన్ కు యుద్ధం ఎప్పుడు చేయాలో తెలుసు

Update: 2019-06-30 07:40 GMT

టీడీపీ నేతలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి యుద్ధం ఎప్పుడు చేయాలో..సామరస్యంగా ఎప్పుడు ఉండాలో తెలుసన్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి ఉమా విమర్శలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారంటే ప్రజా సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి విలువైన సూచనలేమైనా చేస్తారనుకున్నాం. కానీ ఆయన అద్దెకు ఉంటున్న ఇంటికి నోటీసులివ్వడం పైనా, నారావారిపల్లెలోని భవనానికి కాపలా తగ్గించడం పైన సంతాప తీర్మానాలు చేశారు.

అంటే మీ సమస్యే ప్రజా సమస్యా? కేశినాని నాని ఇకనైనా మారండి. మీ అధినేత బిజెపిని సమర్థిస్తే అందరూ జై కొట్టాలి. యూ-టర్న్ తీసుకుని కాంగ్రెస్ గుంపులో చేరితే అది గొప్ప నిర్ణయమనాలి. తెలంగాణ సీఎంతో ఘర్షణ వైఖరి అవలంబిస్తే మేమూ అదే చేయాలా? బహుదా-వంశధార-నాగావళి లింక్‌ పనులను ఐదేళ్లలో మీరెందుకు పూర్తి చేయలేక పోయారు ఉమా? వనరుల దోపిడీకి తప్ప ఉత్తరాంధ్రను మీరు పట్టించుకున్నదెపుడు? ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3,500 టిఎంసీల గోదావరి నీటితో ప్రతి ఎకరాకు జలాభిషేకం చేస్తారు సీఎం జగన్’. అని పేర్కొన్నారు.

 

Similar News