ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ సారి సీన్ అదే. గత సమావేశాల వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ఈ సారి ప్రతిపక్ష స్థానంలో కూర్చోబోతున్నారు. ఇటీవల వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సీఎం సీటులో ఆసీనులు కానున్నారు. ఈ దృశ్యం జూన్ 12న ఏపీ అసెంబ్లీలో ఆవిష్కృతం కానుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలను జూన్ 12న నుంచి ప్రారంభిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ అయింది.
జూన్ 12న కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం, 13న స్పీకర్ ఎన్నిక, 14న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. సమావేశాలు ప్రారంభానికి ముందే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని ఈ నెల8న విస్తరించబోతున్నారు. ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు...మే23న వెలువడిన విషయం తెలిసిందే. అందులో వైసీపీ 151 సీట్లతో అప్రతిహత విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.