వైసీపీలో దూకుడుగా ఉన్న నేతల్లో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒకరు. మంత్రి పదవి దక్కించుకోలేకపోయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు పదవులు కట్టబెట్టారు. అందులో ఒకటి అత్యంత కీలకమైన తిరుమల అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (తుడా)చైర్మన్ పదవి. దీంతోపాటు చంద్రగిరి ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అసెంబ్లీలో విప్ గా కూడా నియమించారు. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించింది.