టీటీడీబోర్డు వివాదం..రద్దు చేస్తేనే వెళతాం

Update: 2019-05-28 06:12 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డుకు అధికారులు ఝలక్ ఇచ్చారు. మంగళవారం తిరుమలలో బోర్డు సమావేశం జరిగింది. ప్రభుత్వం మారిన తరుణంలో సభ్యులు రాజీమానా చేయకుండా సమావేశం నిర్వహించటంపైనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులందరూ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జెఈవో శ్రీనివాసరాజుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇద్దరూ సమావేశం ప్రారంభం అయిన కొద్దిసేపటికే వీరు బయటకు వచ్చేశారు. తిరిగి బోర్డు సమావేశానికి వెళ్లలేదు. ఎలాంటి ఏజెండా చేపట్టకుండానే సమావేశం ముగిసింది.

సమావేశం అనంతరం ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ సమావేశానికి ఈవో, జెఈవో వస్తారని చూశామని..కానీ వారు తిరిగి రాలేదని చెప్పారు. తమను గత ప్రభుత్వం నియమించిందని..ప్రమాణ స్వీకారం చేశామన్నారు. కొత్త ప్రభుత్వం తమను పదవుల్లో నుంచి తొలగిస్తే తప్ప..తమంతట తాము రాజీనామా చేసే యోచనలేదని తేల్చిచెప్పారు. స్వచ్చందంగా రాజీనామా చేసే యోచనలేదని ప్రకటించారు. వాస్తవానికి టీటీడీ బోర్డు సమావేశంపైనే వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీటీడీ బోర్డును రద్దు చేయటం అనివార్యంగా కన్పిస్తోంది. టీటీడీ హయాంలో ఏర్పాటైన బోర్డును రద్దు చేసి..కొత్త ప్రభుత్వం కొత్త బోర్డును నియమించే ఛాన్స్ ఉంది.

 

Similar News