బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధాని మోడీతో సమావేశం అనంతరం జగన్ నేరుగా అమిత్ షా నివాసానికి వెళ్ళి అరగంట పాటు ఆయనతో సమావేశం అయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేంద్రంలో రెండోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అమిత్ షాను జగన్ అభినందించారు. ఇద్దరి మధ్య సమావేశంలో ఏపీ విభజన హామీలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహాయసహకారాలు అందించాలని అమిత్‌షాను కోరారు.