కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఫోని తుఫాన్ అతలాకుతలం చేస్తుండటంతో అక్కడ సహాయ కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు కోడ్ తొలగిస్తున్నట్లు పేర్కొంది. తూర్పు గోదావరి జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కోడ్ నుంచి మినహాయించారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కోడ్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీఈసీకి లేఖ రాశారు. లేఖపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఈ నిర్నయం తీసుకుంది.