చంద్రబాబు మెడికల్ చెకప్

Update: 2019-05-31 08:02 GMT

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయమే వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారు. చంద్రబాబు నగరంలోని ఏషియన్ గాస్ట్రోలజి హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. ఏషియన్ గాస్ట్రోలజి హాస్పిటల్‌కి ఉదయం పరగడపునే బాబు వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపారు.

సుమారు గంటకు పైగా మెడికల్ చెకప్ జరిగిందని తెలుస్తోంది. చెకప్ అనంతరం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఊహించని రీతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశం అయ్యారు.

 

Similar News