ఏపీ డీజీపీకి సీఈసీ నుంచి పిలుపు

Update: 2019-04-04 06:47 GMT

కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీకి పిలిపించి మరీ మందలించిన కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజీపీ ఠాకూర్ ను ఢిల్లీకి పిలిపించుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేయాలన్న సీఈసీ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించటం..ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ బదిలీ నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఘటనపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీ ఇంటెలిఎన్స్‌ వెంకటేశ్వరరావు బదిలీ జీవో వివాదం వ్యవహారంపై డీజీపీని వివరణ కోరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. డీజీపీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైసీపీ ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు లు చేసింది.

 

Similar News