తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నేతలిద్దరూ తమ తమ తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు శనివారం నాడు 69వ జన్మదినాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల సమయంలో అటు ప్రధాని నరేంద్రమోడీ, ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో జగన్ కూడా చంద్రబాబుపై అదే స్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయ విమర్శల సంగతి ఎలా ఉన్నా పుట్టిన రోజు సందర్భంగా ఇలా శుభాకాంక్షలు చెప్పుకునే పద్దతిని అయినా నేతలు కొనసాగించటం శుభపరిణామమే.