ఏపీ ఏసీబీ డీజీగా ఏ బీ వెంకటేశ్వరరావు

Update: 2019-04-22 13:56 GMT

ఎన్నికల ముందు ఊహించని షాక్ కు గురైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు సర్కారు కొత్త పోస్టింగ్ ఇచ్చింది. ఆయన్ను ఏసీబీ డీజీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశాలతో ఆయన్ను ఎన్నికల ముందు ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించి..హెడ్ క్వార్టర్స్ కు ఎటాచ్ చేశారు.

అయితే తర్వాత చంద్రబాబు సర్కారు మళ్ళీ ఏ బీ వెంకటేశ్వరరావును ఆ పోస్టులో నియమించటం..సీఈసీ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్ళటంతో అప్పుడు ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. ఎన్నికలు ముగిసి..ప్రస్తుతం అంతా సద్దుమణిగిన తర్వాత ఏ బీ వెంకటేశ్వరరావుకు కొత్త పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు జీవో నెంబర్‌ 882ను విడుదల చేశారు.

 

Similar News