తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఒక దోంగ..రాక్షసుడు..నేరగాడు అంటూ తీవ్రమైన ఆరోపనలు చేశారు. తప్పులు చేసి కూడా నిస్సిగ్గుగా పాలిస్తున్నాడు. ఆ పెద్ద మనిషి ఏమి చేసినా తప్పు కాదు. ఈనాడుకు చంద్రబాబు ఏమి చేసినా తప్పు కాదు. ఆంధ్రజ్యోతికి, టీవీ5కి తప్పు కాదు. చంద్రబాబుకు చెందిన ప్రైవేట్ కంపెనీల్లో సర్కారు డేటా కన్పిస్తుంది అంటే గోల చేయాలి..ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. కానీ చంద్రబాబునాయుడిని భుజానకెత్తుకుంటారు. ఆయన చేసిన నేరం ఎంత దారుణమైనంది అంటే..మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ చంద్రబాబునాయుడికి తెలుసు. చెక్ బుక్ నెంబర్ తెలుసు. మీ ఆధార్ నెంబర్ చంద్రబాబునాయుడికి తెలుసు. ఇలాంటి సున్నితమైన అంశాలు ప్రైవేట్ కంపెనీల్లో...కంప్యూటర్లలో దొరుకుతుంటే..ఇలాంటి వ్యక్తి పరిపాలన చేయటానికి అర్హుడేనా అని అడుగుతున్నా. మామూలుగా ఇలాంటి నేరాలు ఎవరరైనా చేస్తే మనం అలాంటి వారిని దొంగ అంటాం. కానీ మన ఖర్మ ఏంటి అంటే మనం ముఖ్యమంత్రి అంటున్నాం.
ఆయన కొడుకును ఐటి మంత్రి అంటున్నాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబును నేను గట్టిగా అడుగుతున్నా ఈ బదలాయించకూడదని డేటా ఎందుకు బదలాయించారో చెప్పాలి. రెండు ప్రైవేట్ కంపెనీలు టీడీపీకి సంబంధించిన యాప్ ను తయారు చేశాయి. ఈ ప్రైవేట్ కంపెనీల్లో ఓటర్ల లిస్టుకు సంబంధించి ఉండకూడని డేటా ఎందుకుంది? అని అడుగుతున్నా. ఈ కంపెనీలు ఎవరివి?. ఎవరు పెట్టించినవి. ఈ కంపెనీలతో చంద్రబాబు, లోకేష్ లకు ఉన్న సంబంధాలు ఏంటి? ఎందుకు చంద్రబాబు, లోకేష్ లతో అన్నిసార్లు కలవాల్సిన అవసరం వచ్చింది?. నేరం చేసిన వాళ్ళకు..ఇది చేయించిన చంద్రబాబుకు శిక్ష పడాల్సిన అవసరం ఉందా? లేదా?. శిక్ష పడాల్సిన వారికి తెలంగాణ పోలీసులు దాడులు చేస్తే ఆ కంపెనీ యాజమాన్యాలు చంద్రబాబుకు వాట్సాప్ చేస్తారు..వెంటనే ఆయన ఏపీ పోలీసులను పంపిస్తారు. రాష్ట్ర పోలీసులను సొంత వాచ్ మన్ ల కంటే అన్యాయంగా వాడుకుంటున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండాల్సిన వ్యక్తేనా? అని అడుగుతున్నా.