తెలుగుదేశం పార్టీ ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. టీడీపీ సీనియర్ నేత, ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడికి మరో ఛాన్స్ కల్పించారు. యనమల తోపాటు దువ్వారపు రామారావు, బి టి నాయుడు, శమంతకమణి, అశోక్ బాబు, జగదీష్ లకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. ఏడు ఎమ్మెల్సీల్లో నాలుగు బీసీలు, ఒక రెడ్డి, ఒకటి ఎస్సీలకు ఇచ్చారు. గవర్నర్ కోటాలో శివనాధ్ రెడ్డి, శమంతకమణి పేర్లు ఖరారు చేశారు. విశాఖ స్థానిక సంస్థల కోటా కింద బుద్ధా నాగజగదీశ్వర్ రావు అభ్యర్ధిత్వాన్ని ఎంపిక చేశారు.