ప్రస్తుతం శర్వానంద్ న్యూలుక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాకు సంబంధించి చిత్రాలు కొన్ని బయటకు వచ్చినట్లు ఉన్నాయి. అయితే శర్వానంద్ న్యూలుక్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. పూర్తి గడ్డంతో ఉన్న శర్వానంద్ లుక్ అదిరిపోయింది. ఈ కుర్ర హీరో ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని టాక్.
ఈ మూవీలో శర్వానంద్ రెండు డిఫరెంట్ గెటప్‌లో నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ లో సందడి చేయనుంది. శర్వానంద్ ఈ సినిమా తరువాత తమిళ హిట్ మూవీ ‘96’ రీమేక్‌లో నటించనున్నాడు. ఇందులో శర్వాకు జోడీగా సమంత నటించనున్న విషయం తెలిసిందే.