ప్రతిపక్ష వైసీపీపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే పరిశ్రమలను అడ్డుకోవటంతోపాటు... పెట్టుబడులు రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నేతలతో సోమవారం నాడు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉండాలన్నదే వైసిపి సైకో ధోరణి. అభివృద్ధికి అడ్డుపడటమే వీరి పని అని విమర్శించారు. పించన్ల సభలు భగ్నం చేయడం సైకో పోకడ. ‘పసుపు-కుంకుమ’ భగ్నం చేయడం జగన్ శాడిజం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈవీఎంలకు వ్యతిరేకంగా బిజెపి వ్యతిరేక పార్టీలు అన్నీ సీఈసీని కలుస్తున్నాయని తెలుసుకుని జగన్ కూడా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని అన్నారు. ఓట్ల తొలగింపు పేరుతో దుష్ప్రచారం చేయటం ద్వారా రాజకీయ లబ్దికి ప్రయత్నిస్తున్నారి..వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి తిప్పికొట్టాలన్నారు. కోల్ కతా ర్యాలీ విజయవంతం అయినందునే ప్రధాని మోడీ ఆమెపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారని..అదే బిజెపికి లొంగిపోయిన వారిపై మాత్రం కేసులు ఉండవన్నారు.