ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు ప్రచారం కొత్త సంవత్సరం నుంచే మొదలైందని..దీన్ని మరింత స్పీడ్ పెంచాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అందరం కష్టపడి జనసేన పార్టీని గెలిపించుకుందాం. జన సైనికులు ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలు ప్రచారం చేయాలి’ అని అన్నారు. కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉండాలని, ఆ భవిష్యత్తు పునర్నిర్మాణంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించాలని వ్యాఖ్యానించారు’.
నూతన సంవత్సరం సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పవన్‌కళ్యాణ్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు పవన్‌కల్యాణ్ బుధవారం జిల్లాల వారీగా భేటీ కానున్నారు. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ పలు జిల్లాల్లో పర్యటనలు చేస్తూ జనసేన శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున సంగతి తెలిసిందే.