ఏపీలో రెండవ ఆటోమొబైల్ యూనిట్ రెడీ

Update: 2019-01-29 11:45 GMT

ఆటోమొబైల్ రంగంలో ఏపీ ఇప్పుడిప్పుడే దూసుకెళుతోంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ఇసుజు కార్ల తయారీ సంస్థ ఉత్పత్తి ప్రారంభించగా..ఇప్పుడు అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీ ట్రయల్ రన్ ప్రారంభం అయింది. మంగళవారం నాడు కియా కార్ల యూనిట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలి కారును విడుదల చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంతో ఈయూనిట్ ను ఏర్పాటు చేశారు. కియా పెట్టుబడులతో అనంతపురం ప్రాంతం ఆటోమొబైల్, పారిశ్రామిక హబ్ అవతరించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కొరియా రాయబారి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కియా కార్లకు భారత్ అతి పెద్ద మార్కెట్ అవుతుందని పేర్కొన్నారు.

ఏపీలో తమ ప్లాంట్ వేగంగా పూర్తిచేసేందుకు ప్రభుత్వంతో ఎంతో సహకరించిందని అందుకు ధన్యావాదాలు అని కియో మోటార్స్ ఎండీ కుక్యున్ షిన్ వెల్లడించారు. మొత్తానికి అనంతపురం జిల్లాకు అత్యంత ఆధునికమైన కార్ల తయారీ యూనిట్ రావటంతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. రాబోయే రోజుల్లో మరింత వేగంగా ఈ ప్రాంతంలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. 14600 కోట్ల రూపాయలతో కియా మోటార్స్ ఏపీలో యూనిట్ నెలకొల్పుతోంది. త్వరలోనే ఇక్కడి యూనిట్ లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది.

 

 

Similar News