సాక్ష్యాత్తూ సొంత ప్రభుత్వంపైనే మంత్రి తిరుగుబాటు చేశారు. తనకు ప్రభుత్వం కల్పించిన పోలీసుల భద్రతను వెనక్కి పంపారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు కర్నూలు జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అంతే కాదు..మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానంటూ పోలీసులను హెచ్చరించారు.
పోలీసులు కక్ష కట్టి టీడీపీ కార్యకర్తలు, నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. తన సొంత అనుయాయులపై పీడీ చట్టం ప్రయోగించారని, కార్డన్ సెర్చ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తనకు కల్పించిన భద్రతను కాదన్నారు. సొంత సెక్యూరిటీతోనే మావోయిస్టుల ప్రభావం ఉన్న కర్నూలు జిల్లా రుద్రావరం మండలంలో మంత్రి పర్యటించారు.