ఏపీలో నూతన హైకోర్టు ప్రారంభం

Update: 2019-01-02 05:40 GMT

కొత్త సంవత్సరం తొలి రోజు. ఆంధ్రప్రదేశ్ లో నూతన హైకోర్టు ఏర్పాటు అయింది. దీంతో ఏపీలో నూతన అధ్యాయం ప్రారంభం అయింది. ఏపీలో నూతన హైకోర్టు ఏర్పాటుతో రాష్ట్ర విభజన పూర్తయినట్లు అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఆనందం..బాధలతో కూడిన మిశ్రమంగా ఉందని అన్నారు. కొత్త రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టును ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తనకు మాతృభాషలోనే ప్రసంగించడం ఇష్టమని, కానీ తనది ఇక్కడ సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ తరఫున ద్విపాత్రాభినయం (డ్యూయెల్‌ రోల్‌) కాబట్టి ఆంగ్ల్లంలో మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు. ఈనెల 25కల్లా హైకోర్టు భవనం పూర్తవుతుందని ముఖ్యమంత్రి చెప్పారని, దాని ప్రారంభానికి వచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

‘‘ఇదో చారిత్రక కార్యక్రమం. రాష్ర్టానికి గర్వకారణమైన సందర్భం. సుదూర ఆలోచనలు, కలల సాకారంలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కీలక మలుపు అవుతుంది. 1954 జూలై 5న రాష్ట్ర హైకోర్టు గుంటూరులో మొట్టమొదటిసారిగా ఏర్పాటైంది. అనంతరం పునర్విభజనతో 1956 నవంబరు 1న హైదరాబాద్‌కు తరలివెళ్లింది. 62 సంవత్సరాల్లో మూడు ప్రదేశాలకు ఉన్నత న్యాయస్థానం మారింది’’ అని ఆయన వివరించారు. అతిధుల ఆనోందోత్సవాల మధ్య తాత్కాలిక కోర్టు భవనాలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిఽథిగా పాల్గొని, సీఎంతో కలిసి ఈ భవనాలను ప్రారంభించారు. యాక్టింగ్‌ సీజే జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ రిబ్బన్‌ కట్‌ చేశారు

 

 

Similar News