నవయుగా కోసం ‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!

Update: 2019-01-18 06:27 GMT

పోలవరంలో నామినేషన్ పై ‘నవయుగా’కు వేల కోట్ల రూపాయల అప్పగించటంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అసలు ‘స్కీమ్’ దాగి ఉంది. నవయుగా ఏదో దేశం కోసం సేవ చేస్తున్నట్లు..ఆ కంపెనీకి అండగా నిలవాలన్నట్లు చంద్రబాబు కలరింగ్ ఇస్తున్నారు. నామినేషన్ పై అప్పగించిన పనికి ఇప్పటికే సర్కారు దాదాపు 540 కోట్ల రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించింది. ఇది కాక ఇప్పుడు రోజు వారీ ఖర్చులకు ఏకంగా ఆ సంస్థకు 50 కోట్ల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆర్థిక శాఖ అధికారులు ససేమిరా అన్నారు. మంత్రివర్గంలోనే రోజువారీ కంపెనీ ఖర్చుల కోసం ఇచ్చే మొత్తాన్ని 20 నుంచి 50 కోట్లకు పెంచారు. అయినా సరే ఆర్థిక శాఖ అధికారులు ...మొత్తం పెంచారు తప్ప...నవయుగాకు చెల్లింపులు చేయాలని కేబినెట్ చెప్పలేదు కదా ? అని అడ్డం తిరిగారు.

అంతే ఆర్థిక శాఖ అధికారులపై మండిపడ్డ చంద్రబాబు ఏం తమాషాలు చేస్తున్నారా?. మళ్ళీ రాను అనుకుంటున్నారా?. మీ సంగతి చూస్తా? అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే అస్మదీయ కంపెనీ నవయుగా కు మాత్రం చెల్లింపులు చేసేశారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయనున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ లు చెల్లించిన తర్వాత ఇలా రోజు వారీ ఖర్చులకు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకపోయినా చంద్రబాబు సర్కారు మాత్రం నవయుగాపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తోంది. పోనీ ఇది ఏమైనా ట్రాన్స్ స్ట్రాయ్ లా గా ఆర్థిక కష్టాల్లో ఉన్న కంపెనీయా అంటే అదీ కాదు. అయినా సరే నవయుగా కోసం చంద్రబాబు తన కేబినెట్ మొత్తాన్ని నవయుగా కోసం కదిలిస్తున్నారు.

 

 

Similar News