‘జనసేన’కు గుర్తు వచ్చింది

Update: 2018-12-23 04:40 GMT

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఎన్నికల గుర్తు వచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ‘గ్లాసు’ గుర్తును జనసేనకు కేటాయించింది. ఈ మేరకు శనివారం నాడు నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా 29 కొత్త పార్టీలకు గుర్తులు కేటాయిస్తూ..అందులో జనసేనకు కూడా కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఉమ్మడి గుర్తుకు జనసేన గ్లాసును వాడుకోవచ్చు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఈ గుర్తు వాడుకోవచ్చని తెలిపారు.

 

Similar News