తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగే ఎన్నికలకు సంబంధించి మహాకూటమికి ఆయనే ఫైనాన్షియర్ అని ఆరోపించారు. కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ దూతగా వచ్చి జరిపిన భేటీ వెనక రహస్యం ఇదే. మొత్తం మీద 1000 కోట్ల రూపాయలు పెట్టడానికి డీల్. ఇదంతా పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన లాభం కదా? అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.