చంద్రబాబుపై పవన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-11-04 13:10 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అవకాశవాద రాజకీయాలతో, పూట కోక మాట మార్చే రాజకీయ నాయకులతో ప్రజలు విసుగు చెంది ఉన్నారు..అలసి పోయి ఉన్నారు. ఇంకా మీ నోటితో ప్రజలు మీద చేసే అఘాయిత్వాలు ఆపేసేయాలి... ఇక భరించలేకుండాఉన్నాం’ అంటూ ట్వీట్ చేశారు పవన్.

‘నోరు చేసే అఘాయిత్యాలను పొట్ట భరించలేదు’ అనే చందంగా చంద్రబాబు వ్యవహారాలున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు సమావేశం కావటాన్ని కూడా పవన్ తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు ఎక్కడ నుంచి వచ్చారో చివరకు అక్కడికే చేరానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా అన్నట్లు తాజా ట్వీట్ చేశారు.

Similar News