పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నెటిజన్ల నుంచి శుక్రవారం నాడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నిర్ణయానికి మద్దతు తెలుపుతూ ఆమె ట్విట్టర్ లో ఓ కామెంట్ పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ అడుగుపెట్టకుండా ఆ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను మమతా సమర్థించారు. అందుకు అనుగుణంగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. అంతే మమతా బెనర్జీ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అందరూ కలసి దేశాన్ని లూటీ చేస్తారా? అంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.
మమతా ట్వీట్ కు సమారు 500 వందల కామెంట్లు వస్తే అందులో దాదాపు 480 వరకూ మమతా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినవే ఉండటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వాలు అంటే..అది తమ సొంత రాజ్యం..ప్రాంతాలు అనుకుంటున్నారా? అంటూ మరికొంత మంది మమతా బెనర్జీని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా కేంద్రం మాట్లాడకూడదని చెప్పదలచుకున్నారా? అంటూ మండిపడ్డారు. కోల్ కతాలో జరిగిన శారదా చిట్ ఫండ్ స్కామ్ అంశాన్ని కూడా కొంత మంది ప్రస్తావించారు.